ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను శుక్రవారం నాటికల్లా ముగిస్తానని బ్యాంకర్లకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ట్విట్టర్‌ను 44 బి.డాలర్లకు కొనుగోలు చేస్తానని ప్రతిపాదించిన మస్క్ అందులో 13బి.డాలర్లను బ్యాంకుల నుంచి సమకూర్చుకుంటున్నారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మస్క్ ఈ మేరకు హామీ ఇచ్చారు. బ్యాంకులు సంబంధిత పత్రాలపై సంతకం చేస్తే మస్క్ ఖాతాలోకి నిధులు బదిలి కావడమే తరువాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa