చలికాలంలో పెదవులు పొడిబారడం, పగలడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో పెదవులను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- చాలామంది పెదవులను పొడిబారగానే నాలుకతో తడుపుతుంటారు. అలా అస్సలు చేయకూడదు.
- పెదవులపై తేమ తగ్గకుండా ఉండేందుకు లిప్‌బామ్ రాసుకోవాలి.
- పెదవులను వేళ్లతో తాకడం మానేయాలి.
- పెదవులపై చర్మం పెచ్చులుగా ఊడుతున్నప్పుడు వాటిని బలవంతంగా లాగేయొద్దు.
- వారానికి ఒకసారి తేనె, చక్కెర కలిపిన మిశ్రమంతో పెదవులను మర్దనా చేయాలి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
- టమాటా గుజ్జు పెదవులపై ఉంచితే పెదవులు మృదువుగా మారుతాయి.
- బాదాం నూనెను దూదిబంతితో అద్దుకొని పెదవులపై మర్దనా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa