కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు .ఈ రోజు ఉదయం రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురం గ్రామానికి చేరుకుంటారు. ఆగ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను పరిశీలించి నర్సాపూర్ బయలుదేరి వెళతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం పెదమైనవాని లంకకు చేరుకుంటారు. పార్లమెంట్ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రధాన మంత్రి సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద నిర్మలా సీతారామన్ పెదమైనవాని లంక గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా గ్రామంలో డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ ను సందర్శిస్తారు. అనంతరం ఆమె సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్ నుంచి కాకినాడకు బయలుదేరి వెళతారు. 28వ తేదీన కాకినాడ, విశాఖపట్టణాలలో ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఈనెల 29వ తేదీన తిరిగి ఢిల్లీ వెళతారు.