ఉద్దానం ప్రాంత సమస్యలపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం అసత్యమని ఆయన కొట్టి పారేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉద్దానం సమస్యను గత ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోలేదు. ఉద్దానం బాధితులకు సీఎం వైయస్ జగన్ ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు. ఉద్దానం బాధితులకు సీఎం వైయస్ జగన్ అండగా నిలిచారు అని తెలియజేసారు.