అందరం కలిసికట్టుగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయవచ్చు అని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ అయ్యారు. గతానికి పూర్తి భిన్నంగా అవినీతి లేకుండా, పక్షపాతం చూపకుండా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేశాం. మంచి జరిగిన కుటుంబాల వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఆర్బీకేలను తెచ్చి రైతన్నలు గ్రామం దాటాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఒక్కటీ అందచేస్తున్నాం. ఇంటి వద్దే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నాం. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, నాడు–నేడుతో కార్పొరేట్‌కు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలతో పల్లెల ముఖచిత్రం సంపూర్ణంగా మారుతోంది. డిసెంబర్ నాటికి మిగతా పనులు కూడా పూర్తవుతాయి. ఇవన్నీ రావటంతో గ్రామాల రూపురేఖలు మారి సరికొత్త చిత్రం ఆవిష్కృతమవుతోంది. చేసిన మంచి కళ్లెదుటే కనిపిస్తోందని సీఎం వైయస్ జగన్ చెప్పారు.