కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులకు మత్స్యకారేతర ప్యాకేజీ సైతం పంపిణీ చేయనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రలో కోరిన విన్నపాన్ని సీఎం హోదాలో ఆచరణలో అమలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నంలో పోర్టు నిర్మాణంతో సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇబ్బందిగా మారింది. ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదన 16 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. హార్బర్ నిర్మించాలని కూడా గతంలో పలు సర్వేలు, పరిశీలనలు చేపట్టారు. అందుకోసం పాలకులు అంచనాలు కూడా రూపొందించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని భావించారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల కలగా మిగిలిపోయిన ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు జెన్‌కో మూడో యూనిట్ ప్రారంభోత్సవానికి గురువారం రానున్న సీఎం శంకుస్థాపన చేయనున్నారు.