శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గుజరాతీయుల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్ కి చెందిన భక్తులు ప్రతి సంవత్సరం న్యూఇయర్ వేడుకలను ప్రశాంతి నిలయంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలు జరుపుకోలేదు. ఈ సంవత్సరం ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను పురస్కరించుకొని సాయి కుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేక విద్యుత్ అలంకరణ గావించారు. వేడుకలను పురస్కరించుకొని విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుజరాతీయుల సాంప్రదాయ నృత్యాలతో విద్యార్థిని విద్యార్థులు సందడి చేశారు. సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మారుమ్రోగింది.