నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చిత్తూరు జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోనేటి సుమను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్నారు.