పుట్టపర్తి పట్టణ సమీపంలో గల చిత్రావతి నది పరివాహ ప్రాంతం గట్టుపై కుప్పలు కుప్పలుగా చెత్త వేస్తున్నారు. ఫలితంగా పందులు స్వైర విహారం చేస్తున్నాయి. చిత్రావతి నది గట్టు యువతల నివసిస్తున్న గృహాలు అపార్ట్మెంట్ల నుంచి కాపురాలు ఉంటున్నవారు ఇళ్లలోని చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. మరికొందరైతే చెత్తను నదిలోకి వేస్తున్నారు. ఇప్పటికే నదిలోకి పట్టణంలోని డ్రైనేజ్ నీరు కలిసి కలుషితం అవుతుంది. ఇప్పుడు చెత్త చెదారంతో మరింత కాలుష్యం అవుతుంది. చెత్త చెదారం వల్ల పందులు అక్కడికి చేరుతున్నాయి. దీంతో విష జ్వరాలు, రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నది పరివాహక ప్రాంతంలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ వరకు గృహాలు ఉన్నాయి. దాదాపు 200 ఇల్లు ఉన్నాయి. పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు ఫలితంగా రోగాల బారిన పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే నదిలోని నీరు కలుషితమై బుక్కపట్నం చెరువుకు చేరుతున్నాయి. అంతేగాక పలు రక్షిత నీటి పథకాలలో కూడా కలుషిత నీరు చేరే అవకాశం ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.