రక్తదానం చేయడం వలన ఆపదలో ఉన్న వ్యక్తులు ప్రాణాలు కాపాడిన వారు అవుతారని ఎర్రగొండపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జి. కోటయ్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గురువారం పోలిస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో యువత, పోలీస్ సిబ్బంది పాల్గొని రక్త దానం చేశారు. 6 నెలలకు ఒకసారి రక్తం దానం చేయడం వలన ఒకరి ప్రాణాలు కాపడంతో పాటు ఇచ్చిన వారు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.