అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పెనుగొండ, ఎస్పీ యు.రవిప్రకాష్ అన్నా రు. పెనుగొండ పోలీసు స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు, ఇతర ప్రాధాన్యతాంశాలను ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలో స్కూల్స్, కళాశాలలులో దిశ యాప్ ఉపయోగాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐ జీవీ నాగేశ్వరరావు, ఎస్ఐ రమేష్, సిబ్బంది ఉన్నారు.