ఇంకొల్లులో ఈ నెల 25వ తేదీ రాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ గోరంట్ల బాపూజీ అనే యువకుడు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై నాయబ్ రసూల్ తెలిపారు. ఆ రోజు రాత్రి పఠాన్ జానీ అనే యువకునితో కలిసి మద్యం సేవించి తన ఇంట్లోనే పడుకున్న బాపూజీ మంగళవారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉండగా స్థానికులు రిమ్స్ ఆసుపత్రిలో చేర్చడం తెలిసిందే. కాగా బాపూజీ మృతి చెందినందున ఈ కేసులో హత్య కింద సెక్షన్లు మారుస్తున్నట్లు ఎస్సై చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు