లావేరు మండలం లోపెంటలోని చెత్తకు సంపద కేంద్రం నిరుపయోగంగా మారింది. పంచాయతీ పరిధిలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం, ఆ చెత్తలో పునర్ ఉత్పాదన జరిగే వస్తువులను వేరు చేసి, వాటిని విక్రయించడం ద్వారా పంచాయతీల్లో పారిశుద్ధ్య మెరుగుదల, ఆదాయం సంపాదించడం ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. దీనికోసం జాతీయ ఉపాధి హామీ ద్వారా లక్షల రూపాయల నిధులు వెచ్చించి నాలుగేళ్ల క్రితం నిర్మించారు. దీనిని వినియోగించుకోవడం తో నిరుపయోగంగా మారింది. దీనిని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa