శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో గల బలిఘట్టం గ్రామ సమీపంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సును నిర్వహించబోతున్నట్లు కొత్తవలస తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై తీసుకున్న అంశాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్, మాజీ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, పట్టబద్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa