చీరాల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి పరిశీలకునిగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో జంకె వెంకటరెడ్డిని చీరాల అబ్జర్వర్ గా ఆ పార్టీ హైకమాండ్ పంపింది.
మార్కాపురం నియోజకవర్గం నుండి 1994లో ఇండిపెండెంట్ గా, 2014 లో వైసిపి అభ్యర్ధిగా వెంకటరెడ్డి గెలుపొందారు. 2014 లో ప్రకాశం జిల్లాలో గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఆ రోజున అధికారంలో ఉన్న టీడీపీ లో చేరినప్పటికీ జంకె వెంకటరెడ్డి మాత్రం పార్టీని వీడలేదు. 2019 పందొమ్మిది లో జగన్ సీటివ్వకపోయినా వైసిపి నే ఆయన అంటిపెట్టుకొని ఉన్నారు. రాజకీయ అనుభవం పుష్కలంగా ఉన్న జంకె వెంకటరెడ్డి ని అనేక కోణాల్లో ఆలోచించాకే చీరాల పరిశీలకునిగా పార్టీ అధిష్టానవర్గం నియమించినట్లు భోగట్టా