అనకాపల్లి మండలం లోని దిబ్బపాలెం గ్రామంలో పులి ఒక ఆవుదూడ పై దాడి చేసింది. గతంలో పులి రావడం వివిధ ప్రాంతాలలో జంతువులను తిని భయాందోళనలను సృష్టించడం ఆటవి శాఖ ప్రయత్నాలు విఫల మవ్వడం జరిగిందే. పులి మాట మర్చిపోతున్నాము అన్న సమయం లో ఒక్కసారి గా మండలం లో వూడెరు రెవెన్యూ దిబ్బ పాలెం గ్రామంలో పులి గురువారం రాత్రి ప్రవేశించి మళ్ళ రమణ అన్న రైతు ఆవుదూడను బలితీసుకుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పీలా ఉషా అప్పారావు మాట్లాడుతూ రాత్రి 12 గం టల సమయం లో పులి దాడికి పాల్పడిందన్నారు. వెంటనే పోలీస్ , ఏమార్వో, అటవీ శాఖ అధికారులు కు తెలియపరిచమని అన్నారు. అటవీ శాఖ అధికారులు పాత ముద్రలు గుర్తించి పులి దాడి అని అది చిరుత పులి అని తెలిపారని అన్నారు. గ్రామమంతా భయాందోళనలతో ఉన్నామని చెప్పారు.