రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్త సేకరణ పై అవగాహన నిర్వహించారు. పులివెందుల పురపాలక సంఘం నందు విజయవంతంగా అమలు చేయుటకు నడుం బిగించిన మునిసిపల్ చైర్మన్ డా. వి వర ప్రసాద్, మునిసిపల్ వైస్ చైర్మన్ ఎస్ హాఫీజుల్లా, మునిసిపల్ కమిషనర్ వి వి నరసింహ రెడ్డి తో కలిసి శనివారం పులివెందుల పట్టణము లోని పలుప్రాంతాల్లో పర్యటిస్తు తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసి పురపాలక సంఘ చెత్త సేకరణ వాహనానికి ఇచ్చు కార్యక్రమం పై ప్రజలను చైతన్య పరుస్తూ వారికి అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసి పురపాలక సంఘం చెత్త సేకరణ వాహనానికి ఇచ్చు మహిళలకు ఆయన చీరలను బహుమతిగా అందచేశారు. ఈ కార్య క్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.