టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత హెచ్చరించారు. సీఎం వైయస్ జగన్పై ఇష్టానుసారంగా మాట్లాడితే మహిళలంతా కలిసి నీకు బడితె పూజ చేస్తారని వ్యాఖ్యానించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిస్తే టీడీపీ నేతలు ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి సీఎం సతీమణి వైయస్ భారతమ్మకు ఆపాదించడం సరైంది కాదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, దమ్ముంటే నిజాయితీగా రాజీయాలు చేయాలని, దమ్ముంటే వైయస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాలు విసిరారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడారు.