లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణంచెల్లించినా ఇంకా కట్టాలని వచ్చిన భేదిరింపులతో చేసేదిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. తెర ముందు ఉన్న నలుగురిని అరెస్ట్‌చేసిన పోలీసులు తెర వెనుక ఉన్నవారి కోసం వేట సాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం నెల్లూరులో ఎస్పీ విజయరావు విలేకరులకు వెల్లడించారు. బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆదిత్యనగర్‌కు చెందిన కొండ్రెడ్డి విద్యసాగర్‌రెడ్డి లోన్ యాప్‌లో రూ.30వేలు తీసుకున్నారు. సకాలంలో నగదు చెల్లిస్తున్నా పలువురు ఫోన్లుచేసి లోన్ చెల్లించలేదని, నగదు జమ కాలేదని, తీసుకున్న రుణం చెల్లించకపోతే మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఇలా విద్యాసాగర్ నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేశారు. అయినా వేధింపులు కొనసాగుతుండటంతో గత నెల 30వ తేదీన బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.