నిత్యావసరాల కోసమని ఇంటి నుంచి బయటికి వచ్చిన పదకొండేళ్ల బాలికను ఓ యువకుడు మాయమాటలతో అపహరించాడు. బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో దాడిచేసి పరారయ్యాడు. నిందితుడిని సాయికుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఆరిలోవ నగరంలోని ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక తల్లిదండ్రులు శనివారం ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితులు, దిశ ఏసీపీ ప్రేమ్‌కాజల్ కథనం మేరకు.. విశాఖవేలీ రహదారిలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాధిత బాలిక ఏడుస్తూ పొదల వద్ద కూర్చుని ఉండగా అటుగా వెళ్లిన వారు ఆరాతీశారు. దీంతో జరిగిన ఘోరం వెలుగుచూసింది. ‘మాది ఆదర్శనగర్. వస్తువులు కొనడానికి బయటికి రాగా, ఓ యువకుడు నన్ను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. నేను ఎదురు తిరిగేసరికి తీవ్రంగా కొట్టి వదిలేసి వెళ్లిపోయాడు. నన్ను ఇంటికి తీసుకెళ్లరా...’ అని బాలిక ఏడుస్తూ చెప్పడంతో అక్కడి వారు ఆమెను ఇంటికి చేర్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.