ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ స్థలాలలో అక్రమ గ్రావెల్ తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 30, 2022, 12:49 PM

సంగం,పరిధిలోని  స్థానిక తిరుమనతిప్పలో ప్రభుత్వ ఐటీఐకి కేటాయించిన స్థలంలో గ్రావెల్‌ తరలించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఏడుకొండలు హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ్లలో ఐటీఐకి కేటాయించిన స్థలంలో గ్రావెల్‌ తరలిస్తున్నారని సమాచారం తెలియడంతో పరిశీలించామన్నారు. దీంతో స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీఐకి కేటాయించిన స్థలంలో ఇక మీదట ఎవరైనా గ్రావెల్‌ తరలించడంగానీ, ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం జరిగితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకుడు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com