గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ బ్యాంకు ద్వారా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖను అల్లూరులో ఏర్పాటు చేసినట్టు ఆ బ్యాంకు జోనల్ మేనేజరు మొహ్మద్ మక్సూద్ అలీ అన్నారు. శుక్రవారం నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమానకి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ఎస్బీఐ తరువాత దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందని, ఈ బ్యాంకు ద్వారా డిజిటలైజేషన్లో ప్రథమ స్థానంలో ఉందన్నారు. రైతులకు తమ బ్యాంకు ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ మేనేజరు కృష్ణమూర్తి, అల్లూరు మేనేజరు టి.దర్శన్ కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.