గృహిణులకు ప్రతి నెలా రూ.1000 పంపిణీ చేయనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మహిళలకు నగదు పంపిణీ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆదివారం పేర్కొన్నారు. దీంతో పాటు 16 వేల వృద్ధాప్య పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. పుదుచ్చేరి అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు చెప్పారు.