వివాహ వేడుకలలో వరుడిని గుర్రంపై ఊరేగించే వీడియోలు మనం చూసే ఉంటాం. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫన్ ట్యాప్ అనే ఖాతాలో పోస్ట్ అయిన వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. అందులో వరుడిని ఊరేగించేందుకు వారి వద్ద గుర్రం లేకపోవడంతో గాడిదను ఏర్పాటు చేశారు. ఏదైతే ఏమైందిలే అంటూ ఆ వరుడు కూడా గాడిదపై ఊరేగాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. అయితే వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొత్త పెళ్లి కొడుక్కి ఎన్ని కష్టాలు వచ్చాయో అని కామెంట్లు చేస్తున్నారు.