దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 1,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ నుంచి 1,723 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 17,912కు చేరుకుంది. కోవిడ్ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.