పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. డిపో చరిత్రలో తొలిసారిగా తెనాలి నుంచి అరుణాచలం (తమిళనాడు) క్షేత్రానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. తెనాలి నుంచి నవంబర్ 5వ తేదీ రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి 7వ తేదీ పౌర్ణమి రోజున అరుణాచలం చేరుకుంటుందని చెప్పారు.