కోటప్పకొండ పై భక్తజన కోలాహలం నెలకొంది. కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా కొండకు తరలి వచ్చారు. శ్రీత్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని స్వామికి 160 అభిషేకాలు చేయించారు. ప్రధాన దేవాలయ ప్రాంగణంలోని రావి చెట్టు, నాగేంద్ర స్వామి పుట్ట వద్ద దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వేమూరు గోపి, సూపరింటెండె శివ నాగిరెడ్డి పర్యవేక్షించారు.