వేటపాలెం మండలం లోని బచ్చుల వారి పాలెంలో సోమవారం ఉదయం విద్యుత్ ఘాతానికి గురై పులి ఆదినారాయణ అనే వ్యక్తి మరణించాడు. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం ఆదినారాయణ కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలాల వైపు వెళ్లాడు. అక్కడ ఓ చోట కిందకు వేలాడుతున్న కరెంటు వైర్లు తగిలి విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సురేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి లాంఛనాలు పూర్తి చేశారు. కాగా విద్యుత్ వైర్లను నిర్లక్ష్యంగా వదిలేసి ఒక వ్యక్తి మృతికి కారకుడయ్యాడనే అభియోగంపై పొలం యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ చెప్పారు.