సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలో సోమవారం సిఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని టోల్గేట్ నుండి రాజ్ కన్వెన్షన్ హాల్ వరకు రెండు కిలోమీటర్ల మేర పరుగెత్తె కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరుగుల పోటీలలో ఉపసర్పంచ్ తోట శివ సాయి, విక్టరీ స్కూల్ కరస్పాండెంట్ నరసింహారెడ్డి, హార్టికల్చర్ ప్రిన్సిపల్, టేక్వండు సంస్థ నిర్వాహకులు మౌలా, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికంటే ముందుగా గమ్యస్తానం చేరుకున్న వారికి బహుమతులను బహూకరించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఈరోజు మనకు పెద్ద పండుగ అని, మరో స్వాతంత్ర దినోత్సవం లాంటిదని, భారతదేశంలో 500 పైచిలుకు సంస్థానాలుగా ఏర్పడి వివిధ రకాల పరిపాలనలు కొనసాగిస్తున్న రోజుల్లో మహా నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేసి ఒకే దేశం ఒకే పరిపాలన తీసుకువచ్చారన్నారు.