టెక్కలి: రావివలసలో ఎండల మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. జిల్లాలో నలుమూలల నుంచి కార్తీక సోమవారం స్వామివారిని ప్రతి ఏటా దర్శించుకుంటారు. భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి, మొక్కులను చెల్లించుకున్నారు. మల్లికార్జున స్వామి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటారని అక్కడ ప్రజలు తెలిపారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.