ఎన్నో దశాబ్దాలుగా సరైన రోడ్డు మార్గం లేని ప్రముఖ పుణ్య శైవక్షేత్ర శివాలయం, చిట్వేలు మండలం గుండాలకోన శివాలయానికి ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీనివాసులు ఆలయ కమిటీ వారి సహకారంతో యువ కాంట్రాక్టర్ శివారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మార్గం పూర్తిచేసి, కార్తీకమాస మొదటి సోమవార పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం నూతన రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి మండల వైసిపి కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఎంపీపీ చంద్ర, ధ్వజరెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, లక్ష్మీకర్, నాగిరెడ్డి, రెడ్డయ్య, రాముడు, నాగేశ్వర పాల్గొన్నారు.