ఐకమత్య సామరస్యముతో ప్రతి ఒక్కరూజాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా, భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ, సర్దార్ వల్లబ్ భాయి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 564 సంస్థానాలు ను దేశంలో విలీనం చేసి దేశాన్ని ఏకతాటిపై నడిపించిన మహనీయుడు సర్దార్ వల్లబ్ భాయి పటేల్ అని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ దేశ సమైక్యత, సమగ్రతకు కృషి చేయాలని, అంతర్గత భద్రతకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి జాతీయ ఐక్యతాలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశ స్ఫూర్తిని అభివృద్ది ఫథంలో నడిపించాలన్నారు. ఆయన పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారుని అందుకు ప్రతీకగా హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమీ నకు సర్దార్ వల్లబాయ్ పటేల్ అని నామకరణం చేయడంలో ఆయన గొప్పతనానీకు నిదర్శనం అని అన్నారు.