విశాల భారతదేశాన్ని రూపుదిద్దడంలో సమైక్యతాశక్తిగా సర్దార్ వల్లభాయిపటేల్ కీలకంగా పనిచేశారని డిఎపి సి. హెచ్. జి. వి. ప్రసాద్ పేర్కొన్నారు. ఉక్కుమనిషిగా దేశం యావత్తూ ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో పటేల్ 147వ జయంతి సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి. ఎస్. రామారావు, ముఖ్య అతిధి సి. హెచ్. జి. వి. ప్రసాద్, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్ మాట్లాడుతూ దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చే బృహత్తరమైన కార్యదీక్ష పటేల్ సొంతమన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం దేశంలో విలీనం కాకుండా ఉన్న సంస్థానాలను ఏకం చేసి విశాల భారతాన్ని ఆవిష్కరించారన్నారు. భారతజాతి సమైక్యతా దినోత్సవంగా పటేల్ పుట్టిన రోజును జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం డిఎస్ పిని గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నటుకుల మోహన్, బరాటం లక్ష్మణరావు, పందిరి అప్పారావు, మెట్ట అనంతంభట్లు, బాడాన దేవభూషణ్, నిక్కు హరిసత్యనారాయణ, పొన్నాడ రవికుమార్, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, తర్జాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.