పోలీస్ స్టేషన్ లో వీడియో తీయడం నిషేధం కాదని, వీడియో తీసుకోవచ్చని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచీ స్పష్టం చేసింది. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిషిద్ద ప్రాంతాల జాబితాలో పోలీస్ స్టేషన్ లేదని కోర్టు తెలిపింది. ఓ కేసు విషయంలో పోలీసు స్టేషన్ లో వీడియో తీశాడని వార్దా పోలీసులు అతని పై కేసు నమోదు చేయగా కోర్టు ఈ తీర్పునిచ్చింది.