అత్యాచార బాధితులను పరీక్షించేందుకు చేస్తున్న 'టూ ఫింగర్ టెస్ట్'ను ఇకపై నిర్వహించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ టెస్ట్ మహిళల గౌరవం, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని, నేటికీ ఈ విధానం కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ, ప్రవేట్ వైద్య కాలేజీల స్టడీ మెటీరియల్ నుంచి ఈ టెస్ట్ సిలబస్‌ను తొలగించమని ఆరోగ్యశాఖ కార్యదర్శులను ఆదేశించింది.