టిడ్కో ఇళ్లపై విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. టిడ్కో ఇళ్ల కేటాయింపుపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. టీడీపీ సభ్యులపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సభలో ఎమ్మెల్యే ఏకవచనంతో పిలిచారు. ఇళ్ల కేటాయింపుపై పచ్చ చొక్కాల సభ్యులు మాట్లాడాలంటూ విష్ణు వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల కేటాయింపుపై దర్యాప్తు జరుగుతుందని... చాలా మంది జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. కాగా... ఎమ్మెల్యే తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.