కార్తీక మాసంలో తొలి ఆదివారం రాజమహేంద్రవరం కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాల స్థాయిలో అత్యధికంగా ఉన్న శెట్టిబలిజ, ఉపకులాలైన గౌడ, శ్రీశైన, యాత, ఈడిగ సామాజికవర్గ వనభోజనాలు నిర్వహించారు. పెద్దఎత్తున తరలి వెళ్లాయి. వచ్చే వారం కాపు సామాజికవర్గం పెద్దఎత్తున కుల సమీకరణ చేపడుతోంది. వన భోజనాలకు అదే సామాజిక వర్గాలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల వారిని ఆహ్వానిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజికవర్గం పెద్దఎత్తున భీమవరంలో వన భోజనాలు నిర్వహించి, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజుని ఆహ్వానించారు.