ఏపీకి అమరావతి రాజధాని అని చెప్పిన జగన్ . అధికారంలోకి వచ్చాక మాట తప్పారు.. మడమతిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతాల మధ్య , వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ మూడు రాజధానుల డ్రామా ఆడుతోందని అన్నారు. మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ఏపీలో అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. విశాఖపట్నం అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలిపారు. కేంద్ర పథకాలకు జగన్ సొంత పథకాలుగా పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమని సోమువీర్రాజు మరోసారి స్పష్టం చేశారు.