ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిక్కిరిసిపోతున్న దుర్గమ్మ ఆలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 06:21 PM

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా విజయవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్‌లో కిక్కిరిశారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. పంచారామ క్షేత్రాలు, శైవ క్షేత్రాలలో భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి కృష్ణా నదిలో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలను భక్తులు నదిలో వదులుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com