గుంటూరు జిల్లాలోని కంకరగుంట గేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై రాడ్డు అడ్డంగా కట్టిన కేసులో ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి యర్రగొండపాలెం వాసిగా గుర్తించారు. మరొకరి సాయంతో రాడ్డు కట్టినట్లుగా నిందితుడు విచారణలో ఒప్పుకున్నారు. దీంతో మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాగిన మైకంలో చేసినట్లుగా ప్రాధమిక దర్యాప్తులో నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా... రైల్వేట్రాక్‌పై రాడ్డును రైల్వే సిబ్బంది ముందుగానే గుర్తించడంతో శబరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైల్వే పోలీసులు సెక్షన్ 154, 174సి కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు.