‘‘మూడున్నరేళ్లుగా ప్రజల కన్నీళ్లు, కష్టాలు ఆలకించని సీఎం జగన్... జనసేన పార్టీ జనవాణి చూసి ‘జగనన్నకు చెబుదాం’ అంటూ కొత్త కార్యక్రమం మొదలు పెట్టారు. జనవాణిని 26 జిల్లాల్లో చేస్తామని చెప్పగానే.. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న సీఎం జగన్‌కు ప్రజలు గుర్తుకు వచ్చా రు’’ అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహ ర్ విమర్శించారు. సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో యానాది మహానాడు ఏపీశాఖ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడారు. ‘‘జనవాణి మొదటి సమావేశంలోనే యానాదుల సమస్యలపై జనసేనాని లోతుగా చర్చించా రు. సీఎం ఇంటి నుంచి బయటకు వచ్చి సామాన్యుడిని కలవరు. సామాన్యుడు సీఎం ఇంటికి వెళ్లి అర్జీలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు సమస్యలు గాలికి వదిలేసి నవరత్నాలను వల్లెవేస్తూ కాలం గడిపారు. 12 లక్షల మంది యానాదుల్ని జగన్‌రెడ్డి మోసం చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్‌ను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. యానాదులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. జనసేన ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం పథకంలో యానాదులను భాగస్వాములు చేయడంతో పాటు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అండగా నిలుస్తాం. అతి త్వరలో అధ్యక్షులు పవన్ కల్యాణ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని మనోహర్ హామీ ఇచ్చారు.