ఎల్ఐసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావుకు ఎల్ఐసి ఉద్యోగులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. రేపల్లెలోని వైసిపి కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎల్ఐసి అధికారులు, ఉద్యోగులు మోపిదేవిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని మోపిదేవి ఉద్యోగులకు అభయం ఇచ్చారు.