గుంటూరు కంకర గుంట గేటు సమీపంలో రైల్వే ట్రాక్ పై రాడ్డు అడ్డంగా కట్టిన కేసులో ఒక వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోకరి సాయంతో రాడ్డు కట్టినట్లుగా నిందితుడు విచారణలో ఒప్పుకున్నారు. అయితే మరోకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాగిన మైకంలో చేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.