మంగళగిరి నగరంలోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుని ఎమ్మెల్యే ఆర్కే పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.