అమరావతి రాజధాని కేసు విచారణలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మంగళవారం ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని అంతా భావించారు. వాస్తవానికి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈకేసు విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ నుంచి వైదొలగుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నిర్ణయించారు. దీంతో వేరే బెంచ్ ముందు ఈ కేసు విచారణ జరగనుంది. దీనికి కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.