చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పెదకాపల్లి పంచాయతీ పెనుగొలకల గ్రామానికి పండగ కి వచ్చి తిరుగు ప్రయాణమై తమ సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళుతున్న భార్య భర్తలపై మార్గమధ్యలో దాడి చేసి బంగారు నగలను అపహరించుకు వెళ్ళిన దుండగలు. వారి వాహనం వెనకాల ద్విచక్ర వాహనంలో వెంబడించి జనసంచారం లేని చోట వాహనాన్ని ఆపి కళ్లలో కారం కొట్టి అడ్డొచ్చిన భర్తను హతమార్చి బంగారం లాక్కెళ్లారు. పుంగనూరు నియోజకవర్గం బత్తలపల్లి గ్రామానికి చెందిన దామోదర్ (26) తీవ్ర రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్దపంజాణి, పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.