ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. దంపతులతో పాటు వారి ఇంటి పనిమనిషి హత్యకు గురయ్యింది. ఆ వీరిని సమీర్ అహుజా, అతని భార్య షాలుగా గుర్తించారు. అయితే వారి రెండేళ్ల పాప మాత్రం క్షేమంగా ఉంది. ఢిల్లీలోని కౌపైల్ అశోక్ విహార్ లోని ఓ ఇంట్లో ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. వారింట్లో పనిచేస్తున్న మహిళ స్వప్న ఉదయం దంపతుల ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఈ ముగ్గురి హత్య జరిగింది. ఐదుగురు వ్యక్తులు మోటార్‌బైక్‌పై వచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.