రైల్వే కోడూరు పట్టణ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ముద్దలూరి. సుబ్బరామరాజు నియమితులయ్యారు. మంగళవారం రైల్వే కోడూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్ సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు నియామక పత్రం అందజేశారు. రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించినందుకు ఎంపీ మరియు ఎమ్మెల్యేలకు సుబ్బరామరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.