మజ్జిగ చర్మానికి టానిక్ ఫుడ్. ఇది చర్మంలోని బ్యాక్టీరియాను తొలగించి చర్మంపై ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది. మజ్జిగను చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల మజ్జిగలో ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా బాదం నూనె, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి ఈ ప్యాక్ వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.