రాజమండ్రిలో వైసీపీ కాపు మంత్రులు నిర్వహించిన సభ వల్ల కాపు సామాజిక వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. కాపు సామాజికవర్గాన్ని విచ్ఛిన్నం చేసేందుకే ఈ సభ నిర్వహించారని ఆరోపించారు. కాపులను రెచ్చగొట్టేలా కాపు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు హయాంలో ప్రత్యేక కమిషన్ వేసిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే వైసీపీకి భవిష్యత్తు ఉండదన్నారు.